Sunday, September 9, 2012

Panditha prashamsa "ధన్యః శంకరశర్మపండితవరః

మా స్నేహితుడు శ్రీ కాకేరి శంకరశర్మగారు 36 సం. ల సుదీర్ఘమైన తన అధ్యాపక పదవి నుండి విరమణను పొండుచున్నందున తన శేష జీవితమును సుఖసౌఖ్యములతో ఆయురారోగ్యములతో ఆనందముగా గడాపలని కోరుతూ...
{అధ్యాపకపదవీవినివృత్త సందర్భే బ్ర.శ్రీ.కాకేరి శంకర శర్మణే ప్రశంసాపద్య పంచకం}

"ధన్యః శంకరశర్మపండితవరః కాకేరి వంశోద్భవః" .

శ్రీ లక్ష్మీనృహరిర్ హ్యభూత్ చ జనకో శ్రీ ధర్మపుర్యాం ముదా,
విద్యాపాటవకౌశలం చ కృతవాన్ యం శంకరం శంకరః,
తం లక్ష్మీనృహరిర్ హరశ్చ నితరాం పాతాం శుభాశీః ప్రదౌ
సౌఖ్యం శంకరశర్మణే వితరతాత్ కాకేరి వార్ధీందవే || 1 ||

ప్రాతర్యస్తు శివార్చనాదనుదినం సంతృప్తచిత్తః సదా,
ధ్వస్తాజ్ఞానపటా భవంతి యేన వినతాః శిష్యోపశిష్యాః దినే
సాయం యస్య సుహృద్గణః ప్రముదిత శ్చాతుర్యసంభాషణైః
ధన్యః శంకరశర్మపండితవరః కాకేరి వంశోద్భవః || 2 ||

నేత్రే యస్య నిమీలితే నుతముఖే భక్త్యా గిరీశార్చనే,
నేత్రే యస్య వికాసితే ప్రతిదినం భక్త్యా గురోర్దర్శనే |
నేత్రే యస్య చ వర్షితేఽమృతజలం శిష్యేషు వాత్సల్యకం
ధన్యః శంకరశర్మపండితవరః కాకేరి వంశోద్భవః || 3 ||

యస్యాస్తాం పితరౌ హి వాక్యవిభవైః బాల్యే సదానందితాః

యస్మిన్ జ్ఞానవితీర్ణకాశ్చ ముదితా హ్యాచార్యవర్యాః సదా,
ధ్వస్తాజ్ఞానపటా శ్చ శిష్యప్రముఖా అధ్యాపితా యేన హి |
ధన్యః శంకరశర్మపండితవరః కాకేరి వంశోద్భవః || 4 ||

సకలజనాభిరామ ! వరసద్గుణశీల! సుసాధుజీవన!
వికసితహృత్సరోజ! వరపండితమండిత! సత్యభూషణ! |
సహజదయార్ద్రచిత్త ! శుభవాఙ్మయభూషితజిహ్వ ! శంకర!
నుతబుధఛాత్ర! తే హివిజయార్థమహం గిరిజాపతిం భజే || 5 ||

బుగ్గారం                                  ~ కోరిడే విశ్వనాథ శర్మా , సంస్కృతోపన్యాసకః ,
30.08.2012


                            ---0O0--

The Rain

         వర్షం


మబ్బులకుండల నెత్తికొని
నిన్న రాత్రి చీకట్లో,
దిగివచ్చి మెరుపు కన్నె
ప్రేమతోడ ఊరిచేరి
మేనుకాంతులు మెరిపించి,
మది నానందపరిచి,
రసఝరుల గురిపించి,
పరులకంట కనపడక
పరుగున ప్రొద్దునే
మటుమాయ మాయెను. 10/9/12

 

Wednesday, September 5, 2012

మావూరిపైన మేఘమాల

         

      మావూరిపైన మేఘమాల
                
గగనాల మేఘమాల కెంత అణకువ
!మావూరిపైన ఒక్క కన్నీటి చుక్క రాల్చకుంది.
 

గర్జిస్తే తుంపుర్లు పడతాయేమోనని,వినయం తో నిశ్శబ్దం గా తప్పుకుంటున్నది.
గర్భ భారం మోయలేక
కనే చోటు కానలేక
భవనాల వీడి వనాలకు
చేరెనేమో మేఘమాల ?

Saturday, August 25, 2012

Nandahana Ugadhi sanmaanam

UGADHI { NEW YEAR DAY} VARNANA


Phani Bhavani - wedding wishes

ఓమ్ గం గణపతయే నమః
ఓం శ్రీవాగీశ్వర్యై నమః ఓం శ్రీశోమేశ్వరాభ్యాం నమః
శుభాశీర్వాదః
వరః - చి. ఫణిభూషణః వధూః - చి.ల.సౌ. భవానీ
ముహూర్తః - శ్రీ నందన శ్రావణ
కృష్ణ దశమీ

తేది: 12.08.2012. .ఉ గం.07.51ని.
************************************************************
శ్లో|| యావన్యోన్యతపః ఫలాయితముదౌ, యౌతుల్యరూపాన్వితౌ,
పూతౌ గౌతమజాసుసైకతతనూ యౌ రామచంద్రార్చితౌ ,
తౌ గౌరీవరరామలింగవరదౌ దత్త్వాఽఽశిషః శ్రీప్రదౌ ,
పాయాస్తాం ఫణిభూషణం సవనితం వధ్వా భవాన్యా వరమ్ .

శ్లో|| జగతః పితరౌ వంద్యౌ భవానీఫణిభూషణౌ ,
పాతాం దత్వా శుభాశంసాన్ భవానీఫణిభూషణౌ.

శ్లో|| లక్ష్మీనృసింహః శ్రితపారిజాతః,
సమస్తకల్యాణవరప్రదాతా,
దత్త్వాఽఽయురారోగ్యశుభాశిషశ్చ
పాయాద్ భవానీఫణిభూషణౌ తౌ ||

శుభాలాషిణః
కోరిడే విశ్వనాథ శర్మా
శ్రీమతి జయలక్ష్మీః కోరిడే శశిభూషణః

తి.తి.దే. కల్యాణమంటపమ్ ధర్మపురి. 9849608311

Maa inti dhomalu - Kavitha

మా ఇంటి దోమలు

మా ఇంటి దోమలకెం త ఆదరణ !
అతిథులనాదరముగా పాడి పిల్చి,
పాదాలపై వాలి వినయముగ ముద్దాడు.

మా ఇంటి దోమలకెంత అణకువ !
పరపురుషుని గని
పరదావెనుకకు చేరు
అసూర్యంపశ్యములు.

మా ఇంటి దోమలకెంత ప్రేమ!
జోరునిదురపొమ్మని, జోలపాటపాడి,
పాదశుశౄషకై మా పాదములనొత్తు.

మా ఇంటి దోమలకెంత తెలివి!
శృంగారరసఝరిలో నీదులాడమని,
నిదురపోనీయక కొత్తదంపతులతో
గీరాడి, పోరాడి, గీట్లాడి, పోట్లాడి,
రాగమాలాపించి, రాతిరివేళ్ళల్లో
నిదురమత్తును వీడదీయు.

Friday, April 27, 2012

unexpected person


        ఎవరవయ్య ! నీవు?
 
పిలవని పేరంటానికి చేరుకొన్న అతిథి !
ఎవరవయ్య ! నీవు? ఫ్రేములో చేరావు?
టక్కేసి, బూట్లేసి, నడుమున చెయ్యేసి,
గోడపై కూర్చుండి స్టైల్ గా ఫోజెట్టి
నా కెమరాకై నీవు ఎదిరిచూస్తున్నావా?
...
శరవేగాన వెళ్ళు కారులోన నేను
మైసూర్ నగరాన్ని గిరిపైన నుండి
తిలకించి,పులకించి,మరింత మైమరచి,
కెమరాలోన బంధించ క్లిక్ మనిపిస్తే,

అంతవేగములోన పరుగెత్తుకొచ్చావు
పెండ్లిచూపులకైనట్టు
ఫోజేట్టి దూరావు.
పిలచి పిల్లనిద్దామన్నా మోము తెలియదాయే
ఎవరవయ్య ! నీవు? ఫ్రేములో చేరావు?

Thursday, April 12, 2012

telugu chando padyaalu.

దత్తపది : అత్త, ఉత్త, రిత్త,చిత్త. రామాయణార్థమున

ఉ. అత్తరినీశ్వరున్ దలచి, ఆరఘురాముడు నెక్కు పెట్టెన
నత్య్త్తమశైవచాపము మహోత్తముడాతని హస్త రశ్మిచే
రిత్తమునయ్యే భారము నరేంద్రకుమారులు నొక్కమారుగా
చిత్తము దప్పి నెవ్వెరపు చెయ్యులతో నటుజూచి రంతయున్.
కొరిడె విశ్వనాథ శర్మ, ధర్మపురి
{సాహితీకౌముది . సాహిత్య్, సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. జులై 2011 లోముద్రితము}

Saturday, April 7, 2012

          పద్మ ప్రాశస్త్యం

ఉదయద్యౌవనముగ్ధమనోహరమై,
ఉద్యద్భానుప్రకాశకరకిరణ
సంయోగపులకితతన్వియై,
మాధుర్యగానగీతాసక్తమధుపములకు
మధుమాధుర్యమునందించుచు,
సుమసౌరభవీచికలతో
సుగంధమును దశదిశలావ్యాప్తినొందింపజేయుచూ,
నిజ యజమానకృత పూజలో
నిటలేక్షునికి అర్పించబడి,
 వరభక్తుల హృదయానందదాయక
ప్రసాదచిహ్నమై,శిరోరత్నమై నిలుచు
 ఓ కమలమా!
పామరునుండి పరమాత్మ వరకు
పరమానందమునందించు ఓ పద్మమా!
పంకజమైనా నీవు ప్రశస్తమైనదానవే !

Saturday, March 31, 2012

buduthadu


          బుడుతడు {18..01.2008 }
                         కోరిడె విశ్వనాథ శర్మ,

బుడిబుడి నడకల బుడుతడు నీలో
నిలిచియున్నాడు కృష్ణమ్మా!
వడి వడి నడకలు వీడి వాడిని
... కడకంటి చూపున కనుమమ్మా!

*ధర్మపురి మంథెన బాలకృష్ణుడై వాడు
మురళీ గానము రాగము తీయుచు
సుమతుల మతుల సంతసమొందగ
అనీలరూపుడై, సునీల చేష్టలతో..
నిఖిల జనులు మురిపించు........................ బుడిబుడి నడకల
 
* శశికాంతు మోముతో నటరాజుచిందులేస్తూ
ఫణిధరు మరిపించి, వినోదము కలిగించి
రాజీవలోచనుడు, శిఖిపింఛశేఖరుడు
మానసమోదమును ప్రసాదించు
ఉత్తముడోయమ్మ మన వాడు........................... బుడిబుడి నడకల

Jai Sri Ram


వారిధిపై వారధిగట్టి
వానరయూథమును చేతను బట్టి
రావణగర్వము ఖర్వము జేసి,
రాక్షసచర్యకు మంగళం పాడి,
అవనీనాథులు జయింపగ లేని
 అవనీతాపకారుడిని
అవ్వనితాపహారుడిని
అవలీలగా అంతమొందించితివి.
అవనీలో జనుల ఆర్తిబాపుటకై
అవతిరించితివి అవనీజానాథ!
అమరులకుకూడ అవధ్యుడైనను
ధర్మసమరం లో
మానవునిచేతిలోమరణం తప్పదని
అవనిన కీర్తి గడించితివి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2
 
జై శ్రీరామ్

నిజనాథుని వరించిన
నిజసుతని జూసి,
అవని నిర్వేదమునొందక
సవతినిగంటి సుతగా
నిజనాథుని అల్లునిగా జేసికొంటి
నిజము ! నాభాగ్యమని
అవని మురుపెమునొందె.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3
 
రాముడేకపత్నీ వ్రతుడనిరి లోకులు,
అనుకూలనాయకుడనిరి కవులు.
అది ఎట్లగున్?

భుజగభూషణుని ధనుర్భంగము జేసి,
 భుజబలశౌర్యప్రతాపము జాపి,
భూజాతచేతిని చేతను బట్టి,
భుజబలగర్వితుని తుదముట్టించి,
నిజదారారక్షణకు మార్గము జూపి,
నిజ దారయందు ప్రేమని చాటి
నిజదాంపత్యము నాదర్శము జేసి
భూలోకాన కీర్తిని గడించిన
సీతారాముల చరిత
కాదెవ్వరికి కమనీయ కావ్యం

ఔను అదియట్లుండన్
పట్టాభిషేకమున సతిగా గైకొని,,
పదిమందిలో ఏలుదునని,
పరవశించే సతితో పలికి,
నాథుడంటే ఇట్లుండవలెనని
అవనీజనుల మెప్పును పొందిన
అవనీనాథునికి అవని
కాదా రెండవపత్ని?
ఆమెపైచూపిన ప్రేమ అమితము కాదా?
రాముడు కాడా దక్షిణ నాయకుడు.?

{అనుకూలుడు =ఒకే భార్య కలిగి, మిక్కిలి ప్రేమగలవాడు,
దక్షిణుడు = అనేక భార్యలయందు సమానమైన
అనురాగముగకలవాడు}

Friday, March 23, 2012

Nenevarini ( who am I ) ?

                నెనెవరిని    

ప్రభూ !
గతమేమిటో గుర్తులేదు.
వర్తమానం అర్థం కాదు
భవిష్యత్తేమిటో తెలియగ లేదు.
ఔను ప్రభూ!
ఇంతకి నేనెవరిని?
కమ్మని అమ్మఒడిలో చేరినప్పడు
చల్లని ఆత్మీయతతో...
వెచ్చని హృదయ స్పందనలో
నేనెవరినో తెలియకనే కరిగిపోయా...

వద్దంటున్నా వినక నన్ను
బడి ఒడిలో పడవేసినఫ్ఫుడు
తోటి వారి అల్లర్లతో
బడి పంతుల పాఠాలతో..
నేనెవరినో తెలియకనే సాగిపోయా...

అన్నింటా జంటగా
నేనుంటా నీవెంట యంటూ
దరిజేరిన అర్ధాంగిని,
మమ్ము సాగే భారము నీదే నంటూ
పుట్టుకొచ్చిన పిల్లలను,
బాధ్యతలతో బతుకుబాటన
బడిపంతులనైనాను.
నాకే అర్థం కాని ఈ జీవనయానం ను
నేనెవరినో తెలియకనే లాగుతున్నా...

విశాల జగద్వేదికలో
ఆద్యంతాలులేని ఈ నాటకములో
ఆజన్మమరణాంతతరంగరంగాలలో
అగుపించని ఓ సూత్రధారీ!

నేనెవరినో తెలియని నాకు
ఎప్పుడిచ్చావు ఈ పాత్రను?
ఎంత వరకీ యాత్ర?

పూర్వ రంగములో నేనుంటినో లేనో?
తదుపరి రంగములో... తెలియదు.
రంగరంగాన రంగులద్దుకొని
విచిత్రపాత్రల పాత్రుడనై
ఎన్నిజన్మల యాత్రికుడనో..

ఐనా ప్రభూ!
నిస్తేజమైన శూన్యమునుండి
నిరాకారమైన ఆత్మను జేసి,
సాకారత్వపు ముసుగును గప్పి,
జన్మపరంపరలో భాగిని జేసి,
చరాచరజగత్తులో జీవిని జేసి,
మనిషిగ మరింత మార్పులు జేసి,
వీడొక ‘వాడ’ని పేరును తెచ్చి..
నిలబెట్టిన నారూపాన్ని జూసి,
నాకే అర్థంకాలేదు
ఇంతకూ
నెనెవరిని స్వామీ!

Friday, March 16, 2012

dharamapuri jatara veduka

ధర్మపురీశుని జతర వేడుక


శ్రితజనపోషక! దానవభంజక! ధర్మపురీశ్వర! దాసరతా!

జాతరలో నిను చూడ , జనమంత వచ్చీరి.
జగదేక! నిను గాంచ, జగమంత కదిలేను.  ........శ్రితజనపోషక! || 

1.నింగీన పందిర్లు, నేలంత ముగ్గూలు,

జగమంత వేదీక, ప్రతి ఇంట రంగూలు,
వచ్చీరి జనమంత, బంధువులై నినుచేర,
ఊరంత పండూగే, నీపెళ్ళీ రోజూన........ ........శ్రితజనపోషక! || 

2.నొక వంక చంద్రూడు, నొక వంక సూరీడు
ఒళ్ళంతా కళ్ళెట్టి, నిను చూడాచేరంగా,

కోనేటీ నీటీలో, తెప్పల్లో తిరిగాడి,
స్తంభాపు మేడాలో, ఊయాలాలూగూచు
సిరి దేవతా నిన్ను, సొగసూన చూడంగ,

దాసూలమై సేవాన, ధన్యులా మైతీమి ........శ్రితజనపోషక! || 

3.దొంగాలబాధ ఇక, భరియింపలేమని
  దాసూలు దయతోడ, నిను చూడవేడంగ
 రథముపై నీవెక్కి, దొంగాల చండాడి,

విజయుడవై నీవిట, ఆర్తూల బ్రోచేవు................శ్రితజనపోషక! || 

4.ఓ లక్ష్మీకాంతూడా!, నీకాంతా లక్ష్మమ్మ
ఏకాంతాసేవాకై , నిను చేరా వచ్చేను,

ఇనకాంతామణూలు, ఇంద్రనీలాలు
ధరియించి పురకాంతలు, పాటల్లూ పాడీరి. ........శ్రితజనపోషక! || 


5.వేదాలూ శాస్త్రాలూ, గాథాలూ గీతాలూ
 నాట్యవాయిద్యాలూ, మౌనస్తోత్రాలు
జయజయధ్వానాలు, చేసిరి జనులంత
మ్రోగంగ జగమంత, భక్తితో తలవంచి,
........శ్రితజనపోషక!

Wednesday, March 14, 2012

Laxmi narasimha kalyanam

              శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణం

కమనీయం నరసింహుని కల్యాణం కావ్యం,
కాంచినవారి నోముల పంట
చేసినవారికి సిరులేఇంట....|| కమనీయం||

ఒకవంక శ్రీదేవీ చూసేను క్రీగంట
నొక వంక భూదేవీ తలవంచే బిడియంగ

 బుగ్గల నిండా సిగ్గులతో భామలిద్దరు మురిసేరు...|| 
                          .........||కమనీయం||    
 బహు ముఖుడు బ్రహ్మ దేవుడు బ్రాహ్మణుడై నిలిచేను,

కన్యల నివ్వ సాగరుడు గంగమ్మతో వచ్చేను.
మహేశుడు గణేశుడు సురేశుడు గిరీశుడు
పెద్దలై హరిముందు గద్దెనెక్కి కూర్చుండిరి
.||
,
. .........||కమనీయం||
 

Saturday, February 25, 2012

Sorry Vinayaka!

2. కార్టూన్ లోని వినాయక !
కసితీరగ తిట్టకు మమ్ములను

ఉబుసుపోక...లైబ్రరీలో
ఊరకే కూర్చొందామని..వెళ్తే..
మాసపత్రికలో వినాయకుడు
కార్టూన్లో కనిపించాడు.


అయ్యో! స్వామీ! ఇదేమి గతి నీకు
నవరాత్రులు ఆరంభమైతే
ఘనంగా సత్కరిస్తారని
పరుగు పరుగున పరలోకమునుండి
పరుగెత్తుకొచ్చావు.. ఫలితంచూసావా!
భక్తిమాటెలాగున్నా..భగవన్!
బఫూన్లా మార్చారు నిను మరీ బరితెగించి,
ఐనా స్వామి! మాది
సెక్యులర్ దేశం కదా!
అందుకే హిందూ దేవుడిని ఏమన్నా
అడిగే హాక్కు లేదెవ్వడికి

ఇంద్రునికి పోలిసుటోపి పెట్టి
ఇంద్రలోకాన "లూనా"పై తిప్పినా
వి"చిత్ర"ముగా చూపించినా
ఈజీగా తీసుకోవాలి మరి
ఈసురోమంటూ..!

యమునికి సూటేసి, బూట్లేసి,
హోటల్లోని కూడెట్టినా,
భూలోకాన రోడ్లమ్మటా
విచిత్రముగా తిప్పినా..
కుక్కలతో తరిమినా
వి"చిత్రం"గానే చూడాలి.
విపరీతమ్మని పలికితె ..ఒట్టు.

జైశ్రీరామంటే..మతమూఢుడంటాము.
రాముడో పురుగంటే..
రసవత్తరమ్మంటాము.
విషవృక్షం ఆ చరితని
విశదీకరించి చెపుతాము.
అర్థమైతే కదా ఆ తత్త్వం మాకు.
‘హిందు’స్థాన్ అంటే ఎవడైనా
ఇందు స్థానము లేదంటాము.

అందుకే వినాయక! మరి
అందలమెక్కిన పత్రికల్లొ
కార్టూనిష్టులు నిను నిష్ఠతో
డిస్కో చేయించినా ..
వైను రమ్ములతో వైవిధ్యమ్ము చూపించినా,
నవరాత్రుల పేరిట నిను నగుభాటుచేసినా,
పట్టనట్లుండే పరమ సెక్యులరిష్టులము.

అందుకే !
కార్టూన్లోని వినాయక!
కసిగా తిట్టకు మమ్మల్ని.
కాసేపైనా ఆలోచించు
మళ్ళీకలువాలంటే మమ్మల్ని..
                                    ~కొరిడె విశ్వం
                               {జాగృతి’ పత్రికలో ప్రచురితం}

 

Friday, February 24, 2012

Bhasma Dharana

                                      ఓం గం గణపతయే నమః                      
                     లలాట తిలకం- భస్మధారణం
                                                                కొరిడె విశ్వనాథ శర్మ
     నరత్వం దుర్లభంలోకేఅను ఆర్యోక్తిప్రకారము సమస్త జీవకోటిలోమానవజన్మదుర్లభమైనది.
ఇట్టి మానవజన్మలోకూడ ఉద్ధరేదాత్మనాత్మానంఅని చెప్పబడినందున తన కర్మలద్వారా తన

ను తాను ఉద్ధరించుకొనవలెను. మానవునిగా జన్మించినది మొదలు.....       
          "జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ ఋణ వా జాయతే."
                                                            -తైత్తిరీయ సంహిత. 6/3/1015
అని చెప్పబడినట్లు దేవ,పితృ,మనుష్యసంబంధించినఋణములుకలిగినవాడగును. అట్టివాటి
నుండి విముక్తి నొందవలెనంటె శాస్త్రము నిర్దేశించిన నిత్యకర్మాచరణబద్ధుడై యుండవలెనువాటి
లో ముఖ్యముగా...
                 "
సంధ్యా స్నానం జపశ్చైవ దేవతానాం చపూజనమ్,

                వైశ్వదేవం తథాఽఽతిథ్యం షట్ కర్మాణి దినేదినే."
అని సంధ్యాస్నానజపములు,దేవతార్చన, వైశ్వదేవము,ఆతిథ్యం అనునవి ఆరుకర్మలు నిత్య
కర్మలుగా విధించబడినవి
.
ఏ నిత్యకర్మలనాచరించినప్పటికినీ తిలక (త్రిపుండ్ర )ధారణగావించని

చో అట్టి కర్మలు నిష్ప్రయోజనములగునని...            
              "సత్యం శౌచం జపో హోమస్తీర్థం దేవాదిపూజనమ్,
                తస్య వ్యర్థమిదం సర్వం యస్త్రిపుండ్రం న ధారయేత్ ."
అని భవిష్యపురాణం పేర్కొన్నది. ప్రయోగపారిజాతం కూడ..
                  ''అకృత్వా ఫాలతిలకం తస్య కర్మ నిరర్థకమ్ ."
 అని తిలకధారణావశ్యకతను పేర్కొ న్నది.
          తిలకధారణ మూడువిధములు. 1) ఊర్ధ్వపుండ్రము.2) త్రి పుండ్రము.3)చందనధారణము.
అని . కాగా బ్రహ్మపురాణము..
               ''మృత్తికా చందనం చైవ భస్మతోయం చతుర్థకం. "
     అని జలముచే తిలకధారణను నాలగవదిగా పేర్కొన్నది
              "
. ఊర్ధ్వపుండ్రం మృదాకుర్యాత్ భస్మనా తు త్రిపుండ్రకమ్,

                   ఉభయం చందనేనైవ అభ్యంగోత్సవరాత్రిషు."
అని ప్రయోగపారిజాతము ఊర్ధ్వ పుండ్రము మట్టితో త్రిపుండ్రము భస్మముతో, చందనముతొ ఊర్ధ్వపుండ్రముగాను,, త్రిపుండ్రముగాను ఉత్సవరాత్రులలో ధరింపవచ్చునని తెలిపినది. ఊర్ధ్వపుండ్రము తులసీమూలమందలి మట్టితో కాని, లేదా గంగాది నదీ, సముద్రముల తీరములందలి మట్టితో కాని కావించవలెను.లేదా శ్రీ చందనమైననుగ్రహించవలెను.ఊర్ధ్వపుండ్రము గావించునప్పుడు కేశవాదినామములు ఇరువది నాలుగింటినుండి దామోదరనామమువరకు (12) నామములనుచ్చరించుతూ శుక్లపక్షమందు, సంకర్షణాది (12) నామములనుచ్చరించుతూ కృష్ణపక్షమందు లలాట,ఉదర, హృదయ, కంఠ,పార్శ్వ, బాహు, కర్ణములందునూ ఇరువైపులందు మరియూ వీపున, మెడ పైభాగమున ఇట్లు  (12) స్ఠానములందు ధరింపవలెను.
           శ్రీచందనమును తిలకముగా ధరింపదగినదైననూ భగవంతుని అర్చనలో వినియోగింపగా మిగిలినట్టి దానిని మాత్రమే ధరింపవలెనె కాని తనకొరకై సిద్ధముచేసికొనరాదు.
            ఇక భస్మవిలేపనము గురించి
            "
బ్రాహ్మణానాం త్రిపుండ్రకం"

 శ్రీ వైష్ణవులు ఊర్ధ్వపుండ్రము గావించతగినదికాగా,  బ్రాహ్మణులు త్రిపుండ్రభస్మధారణము గావించుట విధింపబడినది.
   
 కావుననే..

         '' శాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ,
            భస్మత్రిపుండ్రైః పూతాత్మా మృత్యుంజయతి మానవః ."
శాద్ధ యజ్ఞ జప హోమ వైశ్వదేవ దేవతార్చనాదులందు భస్మత్రిపుండ్రధారణచేత పూతాత్ము
డై మానవుడు మృత్యువును జయించుచున్నాడని ధర్మసింధువు పేర్కొన్నది
.

             ఇక స్కందపురాణమున...
            "
విభూత్యాది కృతం సర్వం జగదేతచ్చరాచరమ్ ,

              శివస్యాంగణలగ్నయా తస్మాత్తాం ధారయేత్ సదా ."
ఈ చరాచర జగత్తు విభూత్యాదులచేతనే సృజించబడినది.శివునిస్పృశించినవిభూతి సదా ధార్యమైనదని తెలిపినది. అట్టి విభూతిమహాత్మ్యము వివరించుచూ..మహాపాతకియైన చోరుడొకడిని రక్షకభటులు పడవేయగా భూడిదిలో దొర్లిన శునకమొకటి ఆ శవమును తిన ప్రయత్నించునపుడు పైన బూడిదపడినందున ఆ పాపి నిష్పాపియై,కైలాసమును పొందిన వృత్తాంతమును పేర్కొనది.
                కావున అట్టి భస్మమును ధరింపవలెనన్న ముందుగా ఎడమచేతిలో
భస్మమునుంచుకొని పవిత్రమైన కొన్ని నీటిచుక్కలతో తడుపుతూ...
"
ఓం అగ్నిరితి భస్మ | ఓం వాయురితి భస్మ | ఓం జలమితి భస్మ | ఓం సోమమితి భస్మ  | ఓం వ్యోమేతి భస్మ | ఓం సర్వం హవా ఇదం భస్మ | ఓం మన ఏతాని చక్షూంసి భస్మానీతి | "

అనుమంత్రముచే నభిమంత్రించి ధరించవలెను . జలముచే తడుపబడిన భస్మము ప్రాతః కాలమునందు మాత్రమే ధరింపవలెనని , అదే విధముగా మధ్యాహ్నము గంధమిశ్రితముగాను,  సాయంకాలమునందు పొడి భస్మమునుగాను విలేపనము గావించవలేనని దేవీభాగవతము ...
                  ''ప్రాతః ససలిలం భస్మ మధ్యాహ్నే గంధమిశ్రితమ్

                    సాయాహ్నేనిర్జలం భస్మ ఏవం భస్మవిలేపనమ్ . (11/1/43 )పేర్కొన్నది.
                "
మధ్యహ్నాత్ ప్రాక్ జలాక్తం తు పరతో జలవర్జితమ్ . "

అని
అనికూడ స్పష్టము గావించినది. భస్మమును ధరించునపుడు కూడ ...
                 ''తర్జన్యనామికాంగుష్ఠై స్త్రిపుండ్రం తు సమాచరేత్ ."అని తర్జనీ (చూపుడువేలు ) , అనామిక (ఉంగరపువేలు) , అంగుష్ఠం (బొటనవేలు)లను ఉపయోగించవలెనని దేవీభాగవతము తెలిపినది. కాని మరొకచోట..
             '' మధ్యమానామికాంగుష్ఠైరనులోమవిలోమమతః |"అని తర్జనికి బదులు మధ్యమ (నడిమి ) వేలును ఉపయోగించుటకై పేర్కొన బడినది . ఇట్లు భస్మమును అనులోమవిలోమ పద్ధతులలొ ధరింపవలేనని నిర్దేశింపబడినది .అనగా ముందుగా అంగుష్ఠముతో ఊర్ధ్వపుండ్రము (నిలువు గా ) లలాటమధ్యమున గావించి, అటుపిమ్మట మధ్యమ ( నడిమి ), లేదా తర్జనీ వేలితొ మరియు అనామికలతో మధ్యన స్థలమును విడిచుచు నుదుటిన ఎడమ నుండి కుడికి ధరించి
ఆ రెంటివరుసల మధ్యన బొటనవేలితో కుడి నుండి ఎడమకు విలేపితము గావించవలెను. ధరింఛునపుడు మూడురేఖలు స్పష్టముగా అగుపించునట్లుండవలెను. రేఖలు స్పష్టముగా లేనట్టివాడు నరాధముడని పద్మపురాణము....
                "
నిరంతరాలం యః కుర్యాత్ త్రిపుండ్రం సనరాధమః . "
అని పేర్కోనగా, అట్టిరేఖలు నేత్రములను అతిక్రమిచకూడదని దేవీభాగవతము ..
                 నేత్రయుగ్మప్రమాణేన భాలే దీప్తం త్రిపుండ్రకం ."(11/15/23) అని వివరించినది.   అంతేకాక ..
                  ''అతిస్వల్పమనాయుష్యమతిదీర్ఘం తపః క్షయమ్ "
    అట్టిభస్మరేఖలు చిన్నవైనచో ఆయుష్యమును,దీర్ఘమైనచో పుణ్యకర్మాచరణఫలమును హరించివేయునని కూడ పేర్కొన్నది. కావున ప్రమాణానుగుణముగా భస్మరేఖలను ధరింపవలెను          
            భస్మధారణసమయమునందు కూడా త్ర్యంబకంమంత్రముచేతనేకాని , శివతారకమంత్రము చేతనేకాని , లేదా ప్రణవనాదయుక్త శివపంచాక్షరీ మంత్రము చేతనే కాని
ఉచ్చారణపూర్వకముగా ధరింపవలెనని క్రియాసారము....  ,
               

                  ''త్ర్యంబకేన చ మంత్రేణ సతారేణ శివేన వా ,
                         పంచాక్షరేణ మంత్రేణ ప్రణవేన యతేన చ . "
అని ఉపదేశించినది.లలాటమునందు , కంఠమునందు , భుజద్వయములందు హృదయమునందు త్రిపుండ్రవిధానమున భస్మరేఖలు ధరింపవలెను. అట్టి సమయమునందు..
                  ఓం త్ర్యాయుషం జమదగ్నేరితి లలాటే ,
                  ఓం కశ్యపస్య త్ర్యాయుషమితి గ్రీవాయామ్,
                  ఓం యద్దేవేషు త్ర్యాయుషమితి భుజయోః ,
                  ఓం తన్నో అస్తు త్ర్యాయుషమితి హృదయే .
         అని మంత్రించుచు ఆయాస్థానములందు విలేపనము గావించవలెను.అదేవిధముగా నాభి
యందు,భుజశిరస్సులతోపాటు బాహువులసంధులందును వీపుయందు గావించు విధానమును  కూడ ధర్మసింధువు విశదపరిచినది.
 కాని నాభికిందిభాగముననూ, పాదములందునూ భస్మధారణ గావించుట ఉచితము కాదు.
ఇట్లు చెప్పబడిన త్రిపుండ్రముగా ( మూడురేఖలుగా) ధరించువిధానము బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడగా క్షత్రియులకు నాలుగు రేఖలుగాను , వైశ్యలకు రెండు రేఖలు గాను, శూద్రులకు ఒకే రేఖగా ధరించుట శాస్త్ర నిర్దేశితమైనది.

         
           భస్మధారణమహాత్మ్యము ఇట్లు  కొనియాడబడినది....
                      భూతిం భూతకరీ పవిత్రజననీ పాపం చ విధ్వంసినీ
                      చిత్తానందకరీ యశః సుఖకరీ సర్వార్థసంపత్కరీ
,

                           రక్షోభూతపిశాచ రాక్షస మహారక్షైక సంత్రాసినీ
                      తేజోరాజ్యవిశేషపూణ్యజననీ భూతః సదా ధార్యతామ్
.పౌరాణికకల్పోక్త ప్రకాశికా

                                                                            ఇతి శమ్
                                         ----
.౦౦Ooo--

Friday, February 17, 2012

Koride Sadashiva PrashaMsa

ధన్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః
*
శ్లాఘ్యజీవనం:-

కోర్డేవంశసదాశివం హి సుశువే యం బాలకృష్ణో బుధః|
మాతా యం యదజీజనత్ సుగృహిణీరత్నం చ రత్నాంబికా
కన్యాం శోభగుణాన్వితాం పరమదాత్ శ్రీవిశ్వనాథో ముదా
హృష్ట్వా యస్య పితా పునర్భవవిధౌ కృష్ణోఽభవత్ బాలకః
 /యో బాలకృష్ణోఽభవత్ || 1 ||

* విద్యాభ్యసనం:-
వాణీ స్తన్యమదాద్యతోఽముమకరోత్ సంగీత సాహిత్యగమ్
యన్మాతామహరూపమేత్య హి శ్రుతీనధ్యాపయద్వాక్పతిః
|

జ్ఞానం పాశుపతార్చనాత్ పశుపతిర్ దత్తే పరబ్రహ్మకమ్
శ్లాఘ్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః || 2 ||


*నిత్యవిధి:-
 దత్తైర్ యేన న గౌతమీ శుభజలైర్ నోదేతి చార్ఘ్యైర్ రవిః,
ప్రాతర్యస్య శివార్చనే స్వకిరణైర్ దీపం విధత్తే ఖగః|
యేనాధ్యాపితశిష్యకైర్గృహగతైర్ భానుర్గతః పశ్చిమం,
 జ్ఞానార్కస్య సదాశివస్య హి సఖా త్వేవం గతో భాస్కరః ||3 ||

ప్రవృత్తిః :-
 యస్త్వభ్యర్చ్య శివం హ్యవాప్తతనయః,తృప్తిం న గత్వా పునః
,నైకైః పాశుపతైర్హి యేన జగతాం లోకార్తినాశః కృతః|
దత్తైః పిండప్రదానకైస్తు పితరః తీర్థేషుతృప్తింగతాః
ధన్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః || 4 ||


*శివార్చనా:-
ఆచార్యస్తు ప్రవీణ ఏవ హి మహాన్యాసం సమారబ్ధవాన్,
శాస్త్రీ కార్తిక రామ సూర విబుధాః శ్రీ విశ్వనాథస్తథా|
యన్మౌళిః పురుషోత్తమశ్చ నటరాడిత్యాఖ్య విద్వాంసకాః,
సర్వే పాశుపతం సదాశివగృహే రుద్రం సమభ్యర్చయన్ || 5 ||

*ఉగ్రరథోత్సవః:-
 వంశీ చోగ్రరథవ్రతం యదకరోత్ విద్వద్దిలీపాన్వితః,
మిత్రైర్బంధుసహోదరీద్విజవరైర్ ధ్వానం కృతం మంగళమ్|
యత్షష్ట్యబ్దిమహోత్సవే త్రిదివసే హ్యాశీర్దదౌ బ్రాహ్మణాః ,
తచ్చోభాసహితం సదాశివమముం రక్షేత్తు రాజేశ్వరః || 6 ||

                                                ~ కోరిడే విశ్వనాథ శర్మా , సంస్కృతోపన్యాసకః ,
ధర్మపురీ                                                    జయలక్ష్మీ
శ్రీ ఖర
. శ్రావ.. ౧౧                           ఫణి భూషణః,శశిభూషణః
25.08.2011
                         ---0O0--

Friday, February 10, 2012

Gundi Rajanna Shstry Prashasty

శ్రీ గణేశాయనమః              హరిః ఓం            శ్రీ లక్ష్మీ నృసింహ ప్రసన్న!
బ్రహ్మశ్రీ గుండి రాజన్న శాస్త్రీ ధర్మపురీశుకః

డా|| కోరిడే రాజన్న శాస్త్రీ(Rtd Reader, OU)
, & కోరిడే విశ్వనాథ శర్మా సంస్కృతోపన్యాసకః ,

శ్రీ లక్ష్మీ నరసింహసంస్కృతాంధ్ర కళాశాలా, ధర్మపురీ .

వేదార్థసంభృతమతిర్నను కిన్ను కృష్ణః
వేదాంతబోధనపటుర్నను శంకరః కిమ్|
రమ్యైకభాగవతసంలపనః శుకః కిమ్
రాజన్నశాస్త్రిణమహం ప్రణతోఽస్మి సూరిమ్
|| 1 ||

 యో రాజన్నఖిలార్థశాస్త్రకుశలః శాస్త్రీతి కీర్తిప్రభః
హే గోవింద! ముకుంద! అచ్యుత! రఘో! ఏవం హరౌ ప్రీతిమాన్  |
నిత్యం భక్తిసుధారసైకరసితః యః సేచకోఽజ్ఞార్తినాం
వందే మండితపండితం బుధనుతం రాజన్నశాస్త్రిప్రథమ్ || 2||


శూన్యం నాకమభూద్ధి కిన్నుసుకృతై రింద్రోఽపి యాతః కుతః,
పూతాః కిన్నునరా హి యామ్యనగరం నైవం గతా భూతలాత్|
సర్వే కిన్ను గతాః సువిష్ణుపదవీం శ్రోతుం పురాణం హరేః,
యద్ రాజన్నబుధేన విష్ణుపురతః మాధుర్యమాకర్ణ్యతే || 3||

జిహ్వాగ్రవాణీ చతురాననో యః,
బ్రహ్మైక చిత్తః హరిభక్తినిష్ఠః |
పితామహాఖ్యః సితకేశజాలః,
రాజన్నశాస్త్ర్యేష న కిం విధాతా || 4||

త్రిపుండ్రభస్మాంచితఫాలభాగః,
రుద్రాక్షమాలాంచితవత్సభాగః|
జటాసటాశ్మశ్రువిభూషితో యః
రాజన్నశాస్త్రీ కిమసౌ మహర్షిః
|| 5 ||


బ్రహ్మశ్రీ గుండి రాజన్నశాస్త్రీ ధర్మపురీశుకః |
భక్తిరావైర్జనపదాః మోక్షం యేన హి ప్రాపితాః||| 6 ||

Wednesday, February 8, 2012

naa kavanam (geyam)

            నా కవనం.
నా కవనం నాకవనపు పారిజాతమవ్వాలి.
నలువ రాణి చరణాలను పరిమళంతో నింపాలి..........||నా కవనం||

 గోదారి గలగలలు మువ్వల సవ్వడి సేయగ
కలకోకిల కన్నియ కమ్మని రాగము పాడగ
పురివిప్పి మయూరము తాండవనాట్యము లాడగ
,

పరవశాన మనసు నేడు రస ఝరిలో నీదగా.,.........||నా కవనం||

Monday, February 6, 2012

O Draupadi!, who can save you ?

వచనకవితలు
. ద్రౌపదీ ! నిను రక్షింపనెవరితరము?
కోరిడే విశ్వనాథ శర్మ,
శ్రీ ల..సం.ఆం. కళాశాల,ధర్మపురి,
కరీంనగర్ జిల్లా (ఆం ప్ర.) 

ద్రౌపదీ!! నినుజూచి
నిండు సభలో అలనాడు,
మోహితుడై కురురాజు
తొడ జూపి పిలువగా
,

భీషణుడై భీముడు
తొడలు విరిచె రణాన

మదగర్వితుడై దుశ్శాసనుడు
నీచీరలు వొలువగా
,

రొమ్ము చీల్చి రక్తముతో,
నీకురులను భీమబలుడు
ముంచినాడు కసితీరగ

కామితుడై సైంధవుడు
నినుచేరగా నెంచ
అర్ధముండనము జేసి
,

బుద్ధి నేర్పె నీభర్త

 సింహ బలగర్వితుడు
కుత్సిత కీచకుడు నిను
కాముకుడై కాంక్షించగా
ముష్టిఘాతాన యమునికి
పసువు గ బంపి భీముడు
రక్షించినాడు నిను
అలనాడు సాదరముగ

నాటి దుష్టతతి కి సంతతి
ఘనులైనట్టి నేటి ఘనచరితులు
నినుచెరబట్టిరి సాహిత్య లోకాన
వలవలూడ్చిరి కొందరు

నవ్వుకొనుచు
రసజ్ఞులనింకొందరు
అవార్డు లిచ్చి ఆకాశముకెత్తిరి
.

నిను రక్షింపగ నేడు
ఏ భీముడు లేకపోయె
,

ఏధీరుడు రాకపోయె
చేతగాని చేవలేని
నేటితరం
పుట్టుకతో ముసలి దయ్యె
.

సిగ్గుతో వంగిపోయె.
.

*