Tuesday, July 28, 2015

DHARMAPURI VARNANAM ( SAMSKRUTA SHLOKAAS IN TELUGU SCRIPT)

||ధర్మపురీ వర్ణనమ్|| మంగళ శ్లోకాలు :- 1) యో బ్రహ్మాది సమస్త దేవవినుతో లిఙ్గాత్మకస్యాత్మజః , యం లబ్ధ్వా హి ముదాన్వితా సుతనయం గౌరీ జగన్మాతృకా | యస్యేష్టానుగుణం సమస్తవిపదో దూరీకృతా భక్తగాః, వందే తం వరరామలిఙ్గతనయం శ్రీవిఘ్ననాథం సదా || 2)అయికరికర్ణిక ! మూషికవాహన!! పర్వతజాసుత ! సాంబప్రియ ! నుతజనపోషక ! షణ్ముఖసేవిత ! శంకరచుంబితఫాలతట!| వరచతురాననదేవగణార్చిత ! దానవభంజక ! దాసరత! జయ గణనాయక ! విఘ్నవినాశక ! ధర్మపురీజనపాల విభో! 3)ఐశాన్యకోణగతమందిరగో గణేశ ! భక్తైర్ భవాన్ ప్రథమతః ఖలు వందనీయః | దంతైకఘాత వినిపాతితదుష్టదైత్య !, శ్రీరామలింగసుత ! తే చరణౌ నమామి.|| 4)మాత్రా స్వరక్షణకృతే హ్యవతారిత స్త్వం, విఘ్నాంధకార వినివారకభానుతేజః | తే దర్శనార్థమగజాసుత ! వీక్షతేఽయం, శ్రీరామలింగసుత ! తే చరణౌ నమామి.|| 5) అయి ! నిజమూర్ధజపాశజటోద్భవగౌతమజాసికతోద్భవ! భోః, వరరఘువంశకళానిధికీర్తితరాఘవసేవితలింగతనో! | నిజవరభక్తకృతాఘవినాశక ! దాసజనార్థితదానరతే! జయ రజనీకరభూషితశేఖర! ధర్మపురీవిలసన్నిలయ!, || స్వకీయమైన కేశపాశములగు జటలనుండి ప్రాదుర్భవించిన గోదావరి ఇసుక నుండి ఉద్భవించిన ఓస్వామి ! శ్రేష్ఠమైన రఘువంశమునకు చంద్రుడుగా కీర్తించబడిన శ్రీరామునిచే సేవించబడిన ఓలింగరూప! నీ స్వకీయమైన శ్రేష్ఠభక్తులచే చేయబడిన పాపములను నశింప జేయు దేవ ! దాసజనులచే కోరబడినవాటినిచ్చుతలో ప్రీతినొందు ఓ స్వామి ! చంద్రునిచే అలంకరించబడిన శిఖగల ఓ ప్రభు! ధర్మపురియందలి విలాసవంతమైన నిలయముగల ఓ దేవ ! విజయమును పొందుము. ఈ శ్లోకమునందు కవిరాజ విరాజితము అను ఛందస్సు. న గణము, 6 జగణములు లఘువు, గురువులు ఉంటాయి. అయిగిరినందిని.. అను శ్లోకము ఈ ఛందస్సులో ప్రసిద్ధమైనది. ప్రాతః కాలీన గోదావరీ వర్ణన :- 1)యా లక్ష్మీనృహరేఃపదాబ్జలసితా బ్రహ్మాదిదేవైర్యుతా యా రామార్చితరామలింగనిలయా భక్తాఘవిధ్వంసినీ యస్యాః ప్రాగ్దిశి గౌతమీ రవికరాన్ ప్రక్షాలయంతీ సదా, సేయం ధర్మపురీపురం విలసతి క్షేత్రం సతీర్థం మహత్||1|| పురమేదైతే లక్ష్మీనృసింహుని పదారవిందములచే విలసితమైనదో, బ్రహ్మాది దేవతలచే కూడుకున్నదో,పురమేదైతే శ్రీరామార్చిత రామ లింగేశ్వరుని నిలయముకలదై భక్తుల పాపములను విధ్వంసమొన ర్చునట్టి దగుచున్నదో, ఏపురముయొక్క తూర్పుదిక్కున గోదావరీ నది సూర్యునికిరణములను ప్రక్షాళనము గావించుచున్నదో,మహ నీయమైన క్షేత్రము, తీర్థము కూడ ఐనట్టి అట్టి ధర్మపురీ పురము విలసిల్లుచున్నది. 2) గోదావరీగతసురార్పణకౌతుకేందుః, పీయూషభాండపరిపూర్తసుధాకరో హి| వీచీనిబద్ధప్రతిబింబతనుర్ నితాంతం సూర్యోదయే లసతి గచ్ఛతి చంద్రమా హి||2|| గోదావరిలో జేరిన సురులకర్పించవలెనని చంద్రుడు అమృతభాండమునందుపూర్తిగానింపబడిన అమృతముకలవాడై తరంగములందుసంపూర్తిగానిబిడీకృతమైన తనరూపముగలవాడై యుండగా సూర్యోదయము ప్రకాశమానమగుచుండగా అక్కడినుండి నిష్క్రమించుచున్నాడు.గోదావరీగతసురార్పణకౌతుకేందుః,

No comments:

Post a Comment