Saturday, February 25, 2012

Sorry Vinayaka!

2. కార్టూన్ లోని వినాయక !
కసితీరగ తిట్టకు మమ్ములను

ఉబుసుపోక...లైబ్రరీలో
ఊరకే కూర్చొందామని..వెళ్తే..
మాసపత్రికలో వినాయకుడు
కార్టూన్లో కనిపించాడు.


అయ్యో! స్వామీ! ఇదేమి గతి నీకు
నవరాత్రులు ఆరంభమైతే
ఘనంగా సత్కరిస్తారని
పరుగు పరుగున పరలోకమునుండి
పరుగెత్తుకొచ్చావు.. ఫలితంచూసావా!
భక్తిమాటెలాగున్నా..భగవన్!
బఫూన్లా మార్చారు నిను మరీ బరితెగించి,
ఐనా స్వామి! మాది
సెక్యులర్ దేశం కదా!
అందుకే హిందూ దేవుడిని ఏమన్నా
అడిగే హాక్కు లేదెవ్వడికి

ఇంద్రునికి పోలిసుటోపి పెట్టి
ఇంద్రలోకాన "లూనా"పై తిప్పినా
వి"చిత్ర"ముగా చూపించినా
ఈజీగా తీసుకోవాలి మరి
ఈసురోమంటూ..!

యమునికి సూటేసి, బూట్లేసి,
హోటల్లోని కూడెట్టినా,
భూలోకాన రోడ్లమ్మటా
విచిత్రముగా తిప్పినా..
కుక్కలతో తరిమినా
వి"చిత్రం"గానే చూడాలి.
విపరీతమ్మని పలికితె ..ఒట్టు.

జైశ్రీరామంటే..మతమూఢుడంటాము.
రాముడో పురుగంటే..
రసవత్తరమ్మంటాము.
విషవృక్షం ఆ చరితని
విశదీకరించి చెపుతాము.
అర్థమైతే కదా ఆ తత్త్వం మాకు.
‘హిందు’స్థాన్ అంటే ఎవడైనా
ఇందు స్థానము లేదంటాము.

అందుకే వినాయక! మరి
అందలమెక్కిన పత్రికల్లొ
కార్టూనిష్టులు నిను నిష్ఠతో
డిస్కో చేయించినా ..
వైను రమ్ములతో వైవిధ్యమ్ము చూపించినా,
నవరాత్రుల పేరిట నిను నగుభాటుచేసినా,
పట్టనట్లుండే పరమ సెక్యులరిష్టులము.

అందుకే !
కార్టూన్లోని వినాయక!
కసిగా తిట్టకు మమ్మల్ని.
కాసేపైనా ఆలోచించు
మళ్ళీకలువాలంటే మమ్మల్ని..
                                    ~కొరిడె విశ్వం
                               {జాగృతి’ పత్రికలో ప్రచురితం}

 

Friday, February 24, 2012

Bhasma Dharana

                                      ఓం గం గణపతయే నమః                      
                     లలాట తిలకం- భస్మధారణం
                                                                కొరిడె విశ్వనాథ శర్మ
     నరత్వం దుర్లభంలోకేఅను ఆర్యోక్తిప్రకారము సమస్త జీవకోటిలోమానవజన్మదుర్లభమైనది.
ఇట్టి మానవజన్మలోకూడ ఉద్ధరేదాత్మనాత్మానంఅని చెప్పబడినందున తన కర్మలద్వారా తన

ను తాను ఉద్ధరించుకొనవలెను. మానవునిగా జన్మించినది మొదలు.....       
          "జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ ఋణ వా జాయతే."
                                                            -తైత్తిరీయ సంహిత. 6/3/1015
అని చెప్పబడినట్లు దేవ,పితృ,మనుష్యసంబంధించినఋణములుకలిగినవాడగును. అట్టివాటి
నుండి విముక్తి నొందవలెనంటె శాస్త్రము నిర్దేశించిన నిత్యకర్మాచరణబద్ధుడై యుండవలెనువాటి
లో ముఖ్యముగా...
                 "
సంధ్యా స్నానం జపశ్చైవ దేవతానాం చపూజనమ్,

                వైశ్వదేవం తథాఽఽతిథ్యం షట్ కర్మాణి దినేదినే."
అని సంధ్యాస్నానజపములు,దేవతార్చన, వైశ్వదేవము,ఆతిథ్యం అనునవి ఆరుకర్మలు నిత్య
కర్మలుగా విధించబడినవి
.
ఏ నిత్యకర్మలనాచరించినప్పటికినీ తిలక (త్రిపుండ్ర )ధారణగావించని

చో అట్టి కర్మలు నిష్ప్రయోజనములగునని...            
              "సత్యం శౌచం జపో హోమస్తీర్థం దేవాదిపూజనమ్,
                తస్య వ్యర్థమిదం సర్వం యస్త్రిపుండ్రం న ధారయేత్ ."
అని భవిష్యపురాణం పేర్కొన్నది. ప్రయోగపారిజాతం కూడ..
                  ''అకృత్వా ఫాలతిలకం తస్య కర్మ నిరర్థకమ్ ."
 అని తిలకధారణావశ్యకతను పేర్కొ న్నది.
          తిలకధారణ మూడువిధములు. 1) ఊర్ధ్వపుండ్రము.2) త్రి పుండ్రము.3)చందనధారణము.
అని . కాగా బ్రహ్మపురాణము..
               ''మృత్తికా చందనం చైవ భస్మతోయం చతుర్థకం. "
     అని జలముచే తిలకధారణను నాలగవదిగా పేర్కొన్నది
              "
. ఊర్ధ్వపుండ్రం మృదాకుర్యాత్ భస్మనా తు త్రిపుండ్రకమ్,

                   ఉభయం చందనేనైవ అభ్యంగోత్సవరాత్రిషు."
అని ప్రయోగపారిజాతము ఊర్ధ్వ పుండ్రము మట్టితో త్రిపుండ్రము భస్మముతో, చందనముతొ ఊర్ధ్వపుండ్రముగాను,, త్రిపుండ్రముగాను ఉత్సవరాత్రులలో ధరింపవచ్చునని తెలిపినది. ఊర్ధ్వపుండ్రము తులసీమూలమందలి మట్టితో కాని, లేదా గంగాది నదీ, సముద్రముల తీరములందలి మట్టితో కాని కావించవలెను.లేదా శ్రీ చందనమైననుగ్రహించవలెను.ఊర్ధ్వపుండ్రము గావించునప్పుడు కేశవాదినామములు ఇరువది నాలుగింటినుండి దామోదరనామమువరకు (12) నామములనుచ్చరించుతూ శుక్లపక్షమందు, సంకర్షణాది (12) నామములనుచ్చరించుతూ కృష్ణపక్షమందు లలాట,ఉదర, హృదయ, కంఠ,పార్శ్వ, బాహు, కర్ణములందునూ ఇరువైపులందు మరియూ వీపున, మెడ పైభాగమున ఇట్లు  (12) స్ఠానములందు ధరింపవలెను.
           శ్రీచందనమును తిలకముగా ధరింపదగినదైననూ భగవంతుని అర్చనలో వినియోగింపగా మిగిలినట్టి దానిని మాత్రమే ధరింపవలెనె కాని తనకొరకై సిద్ధముచేసికొనరాదు.
            ఇక భస్మవిలేపనము గురించి
            "
బ్రాహ్మణానాం త్రిపుండ్రకం"

 శ్రీ వైష్ణవులు ఊర్ధ్వపుండ్రము గావించతగినదికాగా,  బ్రాహ్మణులు త్రిపుండ్రభస్మధారణము గావించుట విధింపబడినది.
   
 కావుననే..

         '' శాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ,
            భస్మత్రిపుండ్రైః పూతాత్మా మృత్యుంజయతి మానవః ."
శాద్ధ యజ్ఞ జప హోమ వైశ్వదేవ దేవతార్చనాదులందు భస్మత్రిపుండ్రధారణచేత పూతాత్ము
డై మానవుడు మృత్యువును జయించుచున్నాడని ధర్మసింధువు పేర్కొన్నది
.

             ఇక స్కందపురాణమున...
            "
విభూత్యాది కృతం సర్వం జగదేతచ్చరాచరమ్ ,

              శివస్యాంగణలగ్నయా తస్మాత్తాం ధారయేత్ సదా ."
ఈ చరాచర జగత్తు విభూత్యాదులచేతనే సృజించబడినది.శివునిస్పృశించినవిభూతి సదా ధార్యమైనదని తెలిపినది. అట్టి విభూతిమహాత్మ్యము వివరించుచూ..మహాపాతకియైన చోరుడొకడిని రక్షకభటులు పడవేయగా భూడిదిలో దొర్లిన శునకమొకటి ఆ శవమును తిన ప్రయత్నించునపుడు పైన బూడిదపడినందున ఆ పాపి నిష్పాపియై,కైలాసమును పొందిన వృత్తాంతమును పేర్కొనది.
                కావున అట్టి భస్మమును ధరింపవలెనన్న ముందుగా ఎడమచేతిలో
భస్మమునుంచుకొని పవిత్రమైన కొన్ని నీటిచుక్కలతో తడుపుతూ...
"
ఓం అగ్నిరితి భస్మ | ఓం వాయురితి భస్మ | ఓం జలమితి భస్మ | ఓం సోమమితి భస్మ  | ఓం వ్యోమేతి భస్మ | ఓం సర్వం హవా ఇదం భస్మ | ఓం మన ఏతాని చక్షూంసి భస్మానీతి | "

అనుమంత్రముచే నభిమంత్రించి ధరించవలెను . జలముచే తడుపబడిన భస్మము ప్రాతః కాలమునందు మాత్రమే ధరింపవలెనని , అదే విధముగా మధ్యాహ్నము గంధమిశ్రితముగాను,  సాయంకాలమునందు పొడి భస్మమునుగాను విలేపనము గావించవలేనని దేవీభాగవతము ...
                  ''ప్రాతః ససలిలం భస్మ మధ్యాహ్నే గంధమిశ్రితమ్

                    సాయాహ్నేనిర్జలం భస్మ ఏవం భస్మవిలేపనమ్ . (11/1/43 )పేర్కొన్నది.
                "
మధ్యహ్నాత్ ప్రాక్ జలాక్తం తు పరతో జలవర్జితమ్ . "

అని
అనికూడ స్పష్టము గావించినది. భస్మమును ధరించునపుడు కూడ ...
                 ''తర్జన్యనామికాంగుష్ఠై స్త్రిపుండ్రం తు సమాచరేత్ ."అని తర్జనీ (చూపుడువేలు ) , అనామిక (ఉంగరపువేలు) , అంగుష్ఠం (బొటనవేలు)లను ఉపయోగించవలెనని దేవీభాగవతము తెలిపినది. కాని మరొకచోట..
             '' మధ్యమానామికాంగుష్ఠైరనులోమవిలోమమతః |"అని తర్జనికి బదులు మధ్యమ (నడిమి ) వేలును ఉపయోగించుటకై పేర్కొన బడినది . ఇట్లు భస్మమును అనులోమవిలోమ పద్ధతులలొ ధరింపవలేనని నిర్దేశింపబడినది .అనగా ముందుగా అంగుష్ఠముతో ఊర్ధ్వపుండ్రము (నిలువు గా ) లలాటమధ్యమున గావించి, అటుపిమ్మట మధ్యమ ( నడిమి ), లేదా తర్జనీ వేలితొ మరియు అనామికలతో మధ్యన స్థలమును విడిచుచు నుదుటిన ఎడమ నుండి కుడికి ధరించి
ఆ రెంటివరుసల మధ్యన బొటనవేలితో కుడి నుండి ఎడమకు విలేపితము గావించవలెను. ధరింఛునపుడు మూడురేఖలు స్పష్టముగా అగుపించునట్లుండవలెను. రేఖలు స్పష్టముగా లేనట్టివాడు నరాధముడని పద్మపురాణము....
                "
నిరంతరాలం యః కుర్యాత్ త్రిపుండ్రం సనరాధమః . "
అని పేర్కోనగా, అట్టిరేఖలు నేత్రములను అతిక్రమిచకూడదని దేవీభాగవతము ..
                 నేత్రయుగ్మప్రమాణేన భాలే దీప్తం త్రిపుండ్రకం ."(11/15/23) అని వివరించినది.   అంతేకాక ..
                  ''అతిస్వల్పమనాయుష్యమతిదీర్ఘం తపః క్షయమ్ "
    అట్టిభస్మరేఖలు చిన్నవైనచో ఆయుష్యమును,దీర్ఘమైనచో పుణ్యకర్మాచరణఫలమును హరించివేయునని కూడ పేర్కొన్నది. కావున ప్రమాణానుగుణముగా భస్మరేఖలను ధరింపవలెను          
            భస్మధారణసమయమునందు కూడా త్ర్యంబకంమంత్రముచేతనేకాని , శివతారకమంత్రము చేతనేకాని , లేదా ప్రణవనాదయుక్త శివపంచాక్షరీ మంత్రము చేతనే కాని
ఉచ్చారణపూర్వకముగా ధరింపవలెనని క్రియాసారము....  ,
               

                  ''త్ర్యంబకేన చ మంత్రేణ సతారేణ శివేన వా ,
                         పంచాక్షరేణ మంత్రేణ ప్రణవేన యతేన చ . "
అని ఉపదేశించినది.లలాటమునందు , కంఠమునందు , భుజద్వయములందు హృదయమునందు త్రిపుండ్రవిధానమున భస్మరేఖలు ధరింపవలెను. అట్టి సమయమునందు..
                  ఓం త్ర్యాయుషం జమదగ్నేరితి లలాటే ,
                  ఓం కశ్యపస్య త్ర్యాయుషమితి గ్రీవాయామ్,
                  ఓం యద్దేవేషు త్ర్యాయుషమితి భుజయోః ,
                  ఓం తన్నో అస్తు త్ర్యాయుషమితి హృదయే .
         అని మంత్రించుచు ఆయాస్థానములందు విలేపనము గావించవలెను.అదేవిధముగా నాభి
యందు,భుజశిరస్సులతోపాటు బాహువులసంధులందును వీపుయందు గావించు విధానమును  కూడ ధర్మసింధువు విశదపరిచినది.
 కాని నాభికిందిభాగముననూ, పాదములందునూ భస్మధారణ గావించుట ఉచితము కాదు.
ఇట్లు చెప్పబడిన త్రిపుండ్రముగా ( మూడురేఖలుగా) ధరించువిధానము బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడగా క్షత్రియులకు నాలుగు రేఖలుగాను , వైశ్యలకు రెండు రేఖలు గాను, శూద్రులకు ఒకే రేఖగా ధరించుట శాస్త్ర నిర్దేశితమైనది.

         
           భస్మధారణమహాత్మ్యము ఇట్లు  కొనియాడబడినది....
                      భూతిం భూతకరీ పవిత్రజననీ పాపం చ విధ్వంసినీ
                      చిత్తానందకరీ యశః సుఖకరీ సర్వార్థసంపత్కరీ
,

                           రక్షోభూతపిశాచ రాక్షస మహారక్షైక సంత్రాసినీ
                      తేజోరాజ్యవిశేషపూణ్యజననీ భూతః సదా ధార్యతామ్
.పౌరాణికకల్పోక్త ప్రకాశికా

                                                                            ఇతి శమ్
                                         ----
.౦౦Ooo--

Friday, February 17, 2012

Koride Sadashiva PrashaMsa

ధన్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః
*
శ్లాఘ్యజీవనం:-

కోర్డేవంశసదాశివం హి సుశువే యం బాలకృష్ణో బుధః|
మాతా యం యదజీజనత్ సుగృహిణీరత్నం చ రత్నాంబికా
కన్యాం శోభగుణాన్వితాం పరమదాత్ శ్రీవిశ్వనాథో ముదా
హృష్ట్వా యస్య పితా పునర్భవవిధౌ కృష్ణోఽభవత్ బాలకః
 /యో బాలకృష్ణోఽభవత్ || 1 ||

* విద్యాభ్యసనం:-
వాణీ స్తన్యమదాద్యతోఽముమకరోత్ సంగీత సాహిత్యగమ్
యన్మాతామహరూపమేత్య హి శ్రుతీనధ్యాపయద్వాక్పతిః
|

జ్ఞానం పాశుపతార్చనాత్ పశుపతిర్ దత్తే పరబ్రహ్మకమ్
శ్లాఘ్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః || 2 ||


*నిత్యవిధి:-
 దత్తైర్ యేన న గౌతమీ శుభజలైర్ నోదేతి చార్ఘ్యైర్ రవిః,
ప్రాతర్యస్య శివార్చనే స్వకిరణైర్ దీపం విధత్తే ఖగః|
యేనాధ్యాపితశిష్యకైర్గృహగతైర్ భానుర్గతః పశ్చిమం,
 జ్ఞానార్కస్య సదాశివస్య హి సఖా త్వేవం గతో భాస్కరః ||3 ||

ప్రవృత్తిః :-
 యస్త్వభ్యర్చ్య శివం హ్యవాప్తతనయః,తృప్తిం న గత్వా పునః
,నైకైః పాశుపతైర్హి యేన జగతాం లోకార్తినాశః కృతః|
దత్తైః పిండప్రదానకైస్తు పితరః తీర్థేషుతృప్తింగతాః
ధన్యో ధర్మపురీ సదాశివబుధః శ్రీకోరిడే వంశజః || 4 ||


*శివార్చనా:-
ఆచార్యస్తు ప్రవీణ ఏవ హి మహాన్యాసం సమారబ్ధవాన్,
శాస్త్రీ కార్తిక రామ సూర విబుధాః శ్రీ విశ్వనాథస్తథా|
యన్మౌళిః పురుషోత్తమశ్చ నటరాడిత్యాఖ్య విద్వాంసకాః,
సర్వే పాశుపతం సదాశివగృహే రుద్రం సమభ్యర్చయన్ || 5 ||

*ఉగ్రరథోత్సవః:-
 వంశీ చోగ్రరథవ్రతం యదకరోత్ విద్వద్దిలీపాన్వితః,
మిత్రైర్బంధుసహోదరీద్విజవరైర్ ధ్వానం కృతం మంగళమ్|
యత్షష్ట్యబ్దిమహోత్సవే త్రిదివసే హ్యాశీర్దదౌ బ్రాహ్మణాః ,
తచ్చోభాసహితం సదాశివమముం రక్షేత్తు రాజేశ్వరః || 6 ||

                                                ~ కోరిడే విశ్వనాథ శర్మా , సంస్కృతోపన్యాసకః ,
ధర్మపురీ                                                    జయలక్ష్మీ
శ్రీ ఖర
. శ్రావ.. ౧౧                           ఫణి భూషణః,శశిభూషణః
25.08.2011
                         ---0O0--

Friday, February 10, 2012

Gundi Rajanna Shstry Prashasty

శ్రీ గణేశాయనమః              హరిః ఓం            శ్రీ లక్ష్మీ నృసింహ ప్రసన్న!
బ్రహ్మశ్రీ గుండి రాజన్న శాస్త్రీ ధర్మపురీశుకః

డా|| కోరిడే రాజన్న శాస్త్రీ(Rtd Reader, OU)
, & కోరిడే విశ్వనాథ శర్మా సంస్కృతోపన్యాసకః ,

శ్రీ లక్ష్మీ నరసింహసంస్కృతాంధ్ర కళాశాలా, ధర్మపురీ .

వేదార్థసంభృతమతిర్నను కిన్ను కృష్ణః
వేదాంతబోధనపటుర్నను శంకరః కిమ్|
రమ్యైకభాగవతసంలపనః శుకః కిమ్
రాజన్నశాస్త్రిణమహం ప్రణతోఽస్మి సూరిమ్
|| 1 ||

 యో రాజన్నఖిలార్థశాస్త్రకుశలః శాస్త్రీతి కీర్తిప్రభః
హే గోవింద! ముకుంద! అచ్యుత! రఘో! ఏవం హరౌ ప్రీతిమాన్  |
నిత్యం భక్తిసుధారసైకరసితః యః సేచకోఽజ్ఞార్తినాం
వందే మండితపండితం బుధనుతం రాజన్నశాస్త్రిప్రథమ్ || 2||


శూన్యం నాకమభూద్ధి కిన్నుసుకృతై రింద్రోఽపి యాతః కుతః,
పూతాః కిన్నునరా హి యామ్యనగరం నైవం గతా భూతలాత్|
సర్వే కిన్ను గతాః సువిష్ణుపదవీం శ్రోతుం పురాణం హరేః,
యద్ రాజన్నబుధేన విష్ణుపురతః మాధుర్యమాకర్ణ్యతే || 3||

జిహ్వాగ్రవాణీ చతురాననో యః,
బ్రహ్మైక చిత్తః హరిభక్తినిష్ఠః |
పితామహాఖ్యః సితకేశజాలః,
రాజన్నశాస్త్ర్యేష న కిం విధాతా || 4||

త్రిపుండ్రభస్మాంచితఫాలభాగః,
రుద్రాక్షమాలాంచితవత్సభాగః|
జటాసటాశ్మశ్రువిభూషితో యః
రాజన్నశాస్త్రీ కిమసౌ మహర్షిః
|| 5 ||


బ్రహ్మశ్రీ గుండి రాజన్నశాస్త్రీ ధర్మపురీశుకః |
భక్తిరావైర్జనపదాః మోక్షం యేన హి ప్రాపితాః||| 6 ||

Wednesday, February 8, 2012

naa kavanam (geyam)

            నా కవనం.
నా కవనం నాకవనపు పారిజాతమవ్వాలి.
నలువ రాణి చరణాలను పరిమళంతో నింపాలి..........||నా కవనం||

 గోదారి గలగలలు మువ్వల సవ్వడి సేయగ
కలకోకిల కన్నియ కమ్మని రాగము పాడగ
పురివిప్పి మయూరము తాండవనాట్యము లాడగ
,

పరవశాన మనసు నేడు రస ఝరిలో నీదగా.,.........||నా కవనం||

Monday, February 6, 2012

O Draupadi!, who can save you ?

వచనకవితలు
. ద్రౌపదీ ! నిను రక్షింపనెవరితరము?
కోరిడే విశ్వనాథ శర్మ,
శ్రీ ల..సం.ఆం. కళాశాల,ధర్మపురి,
కరీంనగర్ జిల్లా (ఆం ప్ర.) 

ద్రౌపదీ!! నినుజూచి
నిండు సభలో అలనాడు,
మోహితుడై కురురాజు
తొడ జూపి పిలువగా
,

భీషణుడై భీముడు
తొడలు విరిచె రణాన

మదగర్వితుడై దుశ్శాసనుడు
నీచీరలు వొలువగా
,

రొమ్ము చీల్చి రక్తముతో,
నీకురులను భీమబలుడు
ముంచినాడు కసితీరగ

కామితుడై సైంధవుడు
నినుచేరగా నెంచ
అర్ధముండనము జేసి
,

బుద్ధి నేర్పె నీభర్త

 సింహ బలగర్వితుడు
కుత్సిత కీచకుడు నిను
కాముకుడై కాంక్షించగా
ముష్టిఘాతాన యమునికి
పసువు గ బంపి భీముడు
రక్షించినాడు నిను
అలనాడు సాదరముగ

నాటి దుష్టతతి కి సంతతి
ఘనులైనట్టి నేటి ఘనచరితులు
నినుచెరబట్టిరి సాహిత్య లోకాన
వలవలూడ్చిరి కొందరు

నవ్వుకొనుచు
రసజ్ఞులనింకొందరు
అవార్డు లిచ్చి ఆకాశముకెత్తిరి
.

నిను రక్షింపగ నేడు
ఏ భీముడు లేకపోయె
,

ఏధీరుడు రాకపోయె
చేతగాని చేవలేని
నేటితరం
పుట్టుకతో ముసలి దయ్యె
.

సిగ్గుతో వంగిపోయె.
.

*

Venugopala mangalaashtakam

ॐ गं गणपतयॆ नमः ।।            ॐ श्री वागीश्वर्यै नमः॥
              श्रीमद्धर्मपु्रीवासिनः
      श्री वॆणुगॊपालस्वामिनः
                 मङ्गळाष्टकम्  
1)  दक्षिणॆ सत्यभामा च वामॆ तॆ रुक्मिणी विभॊ!    
   धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥
 2) वॆणुभूषितहस्ताय वॆणुगानप्रियात्मनॆ ।
    धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥ 
3) पीतांबरांचितायास्मै प्रणतः क्लॆशनशिनॆ । 
  धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥

4) भास्वत्कौस्तुभवत्साय भक्ताभीष्टप्रदायिनॆ ।
 धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥ 

5) धृतचक्रगदायास्मै हृतकंसादिरक्षसॆ । 
  धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥ 


6) आदिमध्यान्तहीनाय त्रिगुणात्मकरूपिणॆ । 
  धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥ 


7)  परब्रह्मस्वरूपाय सच्चिदानंदरूपिणॆ । 
  धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥ 


8) विश्वनाथनुतायास्मै विश्वरक्षणहॆतवॆ । 
  धर्मपूर्वेणुगोपाल ! तुभ्यं कृष्णाय मंगलम् ॥
भगवदाशीर्वादाभिलाषी
कोरिडॆ विश्वनाथ शर्मा
धर्मपुरी