Saturday, February 25, 2012

Sorry Vinayaka!

2. కార్టూన్ లోని వినాయక !
కసితీరగ తిట్టకు మమ్ములను

ఉబుసుపోక...లైబ్రరీలో
ఊరకే కూర్చొందామని..వెళ్తే..
మాసపత్రికలో వినాయకుడు
కార్టూన్లో కనిపించాడు.


అయ్యో! స్వామీ! ఇదేమి గతి నీకు
నవరాత్రులు ఆరంభమైతే
ఘనంగా సత్కరిస్తారని
పరుగు పరుగున పరలోకమునుండి
పరుగెత్తుకొచ్చావు.. ఫలితంచూసావా!
భక్తిమాటెలాగున్నా..భగవన్!
బఫూన్లా మార్చారు నిను మరీ బరితెగించి,
ఐనా స్వామి! మాది
సెక్యులర్ దేశం కదా!
అందుకే హిందూ దేవుడిని ఏమన్నా
అడిగే హాక్కు లేదెవ్వడికి

ఇంద్రునికి పోలిసుటోపి పెట్టి
ఇంద్రలోకాన "లూనా"పై తిప్పినా
వి"చిత్ర"ముగా చూపించినా
ఈజీగా తీసుకోవాలి మరి
ఈసురోమంటూ..!

యమునికి సూటేసి, బూట్లేసి,
హోటల్లోని కూడెట్టినా,
భూలోకాన రోడ్లమ్మటా
విచిత్రముగా తిప్పినా..
కుక్కలతో తరిమినా
వి"చిత్రం"గానే చూడాలి.
విపరీతమ్మని పలికితె ..ఒట్టు.

జైశ్రీరామంటే..మతమూఢుడంటాము.
రాముడో పురుగంటే..
రసవత్తరమ్మంటాము.
విషవృక్షం ఆ చరితని
విశదీకరించి చెపుతాము.
అర్థమైతే కదా ఆ తత్త్వం మాకు.
‘హిందు’స్థాన్ అంటే ఎవడైనా
ఇందు స్థానము లేదంటాము.

అందుకే వినాయక! మరి
అందలమెక్కిన పత్రికల్లొ
కార్టూనిష్టులు నిను నిష్ఠతో
డిస్కో చేయించినా ..
వైను రమ్ములతో వైవిధ్యమ్ము చూపించినా,
నవరాత్రుల పేరిట నిను నగుభాటుచేసినా,
పట్టనట్లుండే పరమ సెక్యులరిష్టులము.

అందుకే !
కార్టూన్లోని వినాయక!
కసిగా తిట్టకు మమ్మల్ని.
కాసేపైనా ఆలోచించు
మళ్ళీకలువాలంటే మమ్మల్ని..
                                    ~కొరిడె విశ్వం
                               {జాగృతి’ పత్రికలో ప్రచురితం}

 

No comments:

Post a Comment