Monday, February 6, 2012

O Draupadi!, who can save you ?

వచనకవితలు
. ద్రౌపదీ ! నిను రక్షింపనెవరితరము?
కోరిడే విశ్వనాథ శర్మ,
శ్రీ ల..సం.ఆం. కళాశాల,ధర్మపురి,
కరీంనగర్ జిల్లా (ఆం ప్ర.) 

ద్రౌపదీ!! నినుజూచి
నిండు సభలో అలనాడు,
మోహితుడై కురురాజు
తొడ జూపి పిలువగా
,

భీషణుడై భీముడు
తొడలు విరిచె రణాన

మదగర్వితుడై దుశ్శాసనుడు
నీచీరలు వొలువగా
,

రొమ్ము చీల్చి రక్తముతో,
నీకురులను భీమబలుడు
ముంచినాడు కసితీరగ

కామితుడై సైంధవుడు
నినుచేరగా నెంచ
అర్ధముండనము జేసి
,

బుద్ధి నేర్పె నీభర్త

 సింహ బలగర్వితుడు
కుత్సిత కీచకుడు నిను
కాముకుడై కాంక్షించగా
ముష్టిఘాతాన యమునికి
పసువు గ బంపి భీముడు
రక్షించినాడు నిను
అలనాడు సాదరముగ

నాటి దుష్టతతి కి సంతతి
ఘనులైనట్టి నేటి ఘనచరితులు
నినుచెరబట్టిరి సాహిత్య లోకాన
వలవలూడ్చిరి కొందరు

నవ్వుకొనుచు
రసజ్ఞులనింకొందరు
అవార్డు లిచ్చి ఆకాశముకెత్తిరి
.

నిను రక్షింపగ నేడు
ఏ భీముడు లేకపోయె
,

ఏధీరుడు రాకపోయె
చేతగాని చేవలేని
నేటితరం
పుట్టుకతో ముసలి దయ్యె
.

సిగ్గుతో వంగిపోయె.
.

*

No comments:

Post a Comment