Wednesday, January 25, 2012

Maithry (Frendship) madhuryam

                              మైత్రి 
1 అంతరంగమునమృతవర్షము మేఘమై కురిపించునట్టి,

మైత్రి యను రెండక్షరముల మర్మమేమిటో మిత్రమా  .......... మైత్రి యను ||

1
. శ్రీపతీ శ్రీకృష్ణుడైన, హర్షమొన్దె కుచేలు చెలిమితో,

   రాజునైనా పేదనైనా నొకటి చేయు మందు ఉందా? .......... మైత్రి యను .||

2. తనపరాభేదమ్ము వీడి, ఇచ్చిపుచ్చూ కొనుచునొకటై,
   ఆపదాలందుదాదుకొనుచు, వెంటనుండి ధైర్యమిచ్చు.......మైత్రి యను ||

3 హృదయభావన పంచిపెట్టి నీకునేనని చెప్పునట్టి
.

   తండ్రికైనా చెప్పలేని, తన తల్లి కైనా చెప్పలేని..............మైత్రి యను ||

4  కలసి పంచు భావమిచ్చు ఒకరికొకరమ్మంటు చెప్పు
.

    కంచమైనా మంచమైనా జేబులోని పరసు ఐనా........మైత్రి యను || 


5. పాపబుద్ధి మానిపించి, మంచి గుణము పెంచునట్టి,
    గొప్పగుణము చాటి చెప్పి గూఢ విషయము దాచిపెట్టు......మైత్రి యను || 


6. తలచునంతనె మనసులోన చూచునంతనె కనులలోన,
   అంతరంగమునమృతవర్షము మేఘమై కురిపించునట్టి,...... మైత్రి యను !||

కోరిడే విశ్వనాథ శర్మా
సంస్కృతోపన్యాసక:
                     

No comments:

Post a Comment