Friday, January 27, 2012

Hanmath managala shlokas

ఓం శ్రీవాగీశ్వర్యై నమః     ఓం గం గణపతయే నమః      ఓం శ్రీశోమేశ్వరాభ్యాం నమః
                              ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
                               ఓం శ్రీ ప్రసన్నాంజనేయాయ నమః
                      శ్రీమద్ధర్మపురీ ప్రసన్నాంజనేయ మంగళాశాసనం
భాస్వద్వానర రూపాయ వాయుపుత్రాయ ధీమతే |
అంజనీగర్భజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 ||

సూర్యశిష్యాయ శూరాయ సూర్యకోటిప్రకాశినే |
 సురేంద్రాదిభిర్వంద్యాయ ఆంజనేయాయ మంగళమ్ || 2||

రామసుగ్రీవసంధాత్రే రామాయార్పితచేతసే |
 రామనామైక నిష్ఠాయ రామమిత్రాయ మంగళమ్ || 3 ||

మనోజవేన గంత్రే చ సముద్రోల్లంఘనాయ చ |
 మైనాకార్చిత పాదాయ రామదూతాయ మంగళమ్ || 4 ||

నిర్జిత సురసాయాస్మై సంహృతసింహికాసవే |
 లంకిణీగర్వభంగాయ రామదూతాయ మంగళమ్ || 5 ||

హృతలంకేశగర్వాయ లంకాదహనకారిణే |
 సీతాశోకవినాశాయ రామదూతాయ మంగళమ్ || 6 ||

భీభత్సరణరంగాయ దుష్టదైత్య వినాశినే |
 రామలక్ష్మణవాహాయ రామభృత్యాయ మంగళమ్ || 7 ||

ధృతసంజీవహస్తాయ కృతలక్ష్మణజీవినే |
 భృతలంకాసురార్తాయ రామభటాయ మంగళమ్ || 8 ||

జానకీరామసంధాత్రే జానకీహ్లాదకారిణే |
 హృత్ప్రతిష్ఠితరామాయ రామదాసాయ మంగళమ్ || 9 ||

రమ్యే ధర్మపురీక్షేత్రే నృసింహస్య చ మన్దిరే |
 విలసద్ రామనిష్ఠాయ వాయుపుత్రాయ మంగళమ్ || 10 ||

గాయంతం రామ రామేతి భక్తం తం రక్షకాయ చ |
శ్రీ ప్రసన్నాంజనేయాయ వరదాత్రే చ మంగళమ్ || 11 ||

విశ్వలోకసురక్షాయ విశ్వనాథనుతాయ చ |
శ్రీ ప్రసన్నాంజనేయాయ వరదాత్రే చ మంగళమ్ || 12 ||

భగవదాశీర్వాదాభిలాషీ
కోరిడే విశ్వనాథ శర్మా
ధర్మపురీ

No comments:

Post a Comment