Thursday, January 26, 2012

guruvara ! (O Teacher!) by vojjala manasa

4.గురు వందనం,
 వొజ్జల మానసఎమ్.బి..
 గురువర! గురువర! వందనం, నీకు వందనం.

నీకృషివల్లే పెరిగినాము అందరం మేము అందరం
 

అడుగులేస్తు...చిరు ఆడుగులేస్తు, బడిలోన అడుగిడీ నప్పుడే
    అక్షరాలు దిద్దించి నడిపినావు ముందుకు...మునుముందుకు,
    అనురాగం కురిపించి, ఆరడుగుల మమ్మల్ని
   మహనీయుల చరిత తెలిపి మలచినావు మనిషిగా
, .. మంచి మనిషిగా........

                                                           ....... అందుకే........ గురువర!
 2.జగద్గురు కృష్ణునికి సాందీపని గురువు కదా!
   విశ్వామిత్రుడు రామునికుపదేశం చేయలేదా!
   గుడిలోని దేవుడు బడిలోన చేరి,
    భగవంతుడే నీభక్తుడయ్యేను
                                    ....... అందుకే........ గురువర!
 

3. సమర్థుడైన గురుకృపతొ వీరుడయ్యె శివాజీ,
    ఎవ్వారి చరిత చూడ గురువు లేనిదెక్కడ?..గురువు లేనిదెప్పుడు?
     ధర్మం నిలబెట్టినా, మహనీయులు ఎప్పుడూ
     గురువర్యుల మాటలో నిలిచారు అందరూ
,

     గురువర్యుల బాటలో నడిచారు అందరూ
                                      ....... అందుకే........ గురువర! 

4.బియ్యేలు ఎమ్మేలు ఎంబీబీయస్సులు,
    ఏదైతేనేమి చదువు నీవున్నావక్కడ!
    కరదీపమువై నీవు మార్గము చూపించగా..
   చీకట్లూ వీడి మేము చేరాము గమ్యము
                         ....... అందుకే........ గురువర!

5 . అంధులూ మూర్ఖులూ గర్వంతో
    కొందరు నీ మహత్తు తెలియక, నిందించువారైనా,
    నీ గభీర తేజస్సులో మాడిపోవు పురుగులూ.. మిణుగురు పురుగులూ.అందుకే

   
    త్రిమూర్తులే నీవంటూ.. పరబ్రహ్మ నీవంటూ    
   గురువర గురువర! వందనం, నీకు వందనం.|| 
   నీకృషివల్లే పెరిగినాము అందరం మేము అందరం! .......
                                                                    Editted by KVSharma 

1 comment:

  1. Manasa,great
    I never expected an MBA would write poems.
    Very nice
    chandrasekhar koride

    ReplyDelete